కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ ప్రమాణ స్వీకారం

కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేశ్ (కాంగ్రెస్) ప్రమాణం చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యలు పాల్గొన్నారు. శ్రీగణేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఆయన గెలుపొందిన విషయం విదితమే.