అమెరికాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు … సింగరేణి బృందం
అమెరికాలో జరిగే అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి రెస్క్యూ బృందం వెళ్లనుంది. దీని కోసం సంస్థ రూ.12 లక్షల నిధులను కేటాయించింది. 45 రోజుల పాటు రెస్క్యూ రికవరీ, ఫస్టెయిడ్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇప్పటికే సంస్థ 25 మందిని ఎంపిక చేసి రికవరీ, థియరీ పోటీ పరీక్షలు నిర్వహంచారు. ఇందులో అర్హత సాధించిన 12 మంది ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. వీరిలో 10 మందిని అమెరికాలో జరిగే పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. వీరంతా సెప్టెంబరు 10 నుంచి 16 వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు.













