కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మంత్రి సత్యవతి రాథోడ్

తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‍లో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా టీకాను నిర్భయంగా వేయించుకోవాలన్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తూ కరోనాను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.