కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన… వచ్చే ఎన్నికల్లో
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని వెల్లడించారు. తన స్థానంలో ఈసారి సంగారెడ్డి కార్యకర్తనే నిలబెట్టనున్నట్లు తెలిపారు. క్వాడర్ వద్దంటే తన భార్య నిర్మలను బరిలోకి దింపుతానని పేర్కొన్నారు. మళ్లీ 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయనంటూన్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి ఈ మధ్య కాలంలో మౌనంగా ఉంటున్నారు. సొంత పార్టీలో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన నోరెత్తడం లేదు. నెలరోజులకు పైగా గాంధీభవన్‌కు కూడా రావడం లేదు. దీంతో ఆయన అసలు ఏం చేయాలనుకుంటున్నారనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.













