కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిరసన.. ఎందుకంటే
అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని, అందుకే అంబేద్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిరసన చేపట్టానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ఇస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చిన కేసీఆర్ దాన్ని విస్మరించారని ఆరోపించారు. గత నాలుగు రోజుల నుంచి అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో కేసీఆర్కు తెలియాలన్న ఉద్దేశంతో పాదయాత్ర చేపట్టానని అన్నారు. 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల ఇవ్వాలని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డితో పాటు తన కూతురు జ యారెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.













