సంవిధాన్ రక్షా మార్చ్ లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
బ్రేకింగ్…
ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం వరకు సంవిధాన రక్షా మార్చ్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సంవిధాన్ రక్షా మార్చ్ అనంతరం సభలో గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగం
అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ లు అందించిన రాజ్యాంగం ఇది
కొందరు అధికారం శాశ్వతం చేసుకోవాలని రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు
రాజ్యాంగంపై దాడిని మనం తిప్పికొట్టాలి
దేశానికి స్వాతంత్రం సాధించాలని, సమాన అవకాశాలను అందించాలని 1885 లో కాంగ్రెస్ ఏర్పడింది
ఎందరో తమ ప్రాణ త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని, రాజ్యాంగాన్ని మనకు అందించారు
యుద్ధాలు, హింస లేకుండా అహింసా తో స్వాతంత్ర్యం సాధించిన పార్టీ కాంగ్రెస్
గతంలో రాజులు చనిపోతే, వాళ్ల కొడుకులు, తమ్ముళ్లు అధికారం పొందేవారు
కానీ పాలన ప్రజల చేతుల్లో పెట్టాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ ఆలోచించి రాజ్యాంగాన్ని అందించారు
గిరిజనులు, దళితులు, మహిళలు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు
మేమంతా ప్రజలకు సేవకులం.. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతో ఈ వేదికపై ఉన్నా
రాజ్యంగం అవకాశం కలిపించిన గొప్ప అవకాశం ప్రజాస్వామ్యం
అమెరికాకు 360 ఏళ్ల క్రితమే స్వాతంత్ర్యం వచ్చినా వందల ఏళ్ల వరకు మహిళలకు ఓటు హక్కు అవకాశం కల్పించలేదు
బీజేపీ నాయకులు నాడు కూడా పేదలు, మహిళలకు ఓటు హక్కు వద్దని వాదించారు
అంబేడ్కర్ మాత్రం అందరికీ ఓటు హక్కు కల్పించారు
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్ల డబ్బు తెస్తానని మోసపూరిత హామీలతో మోదీ 2014 లో అధికారంలోకి వచ్చారు
కులమత బేధాలు, తప్పుడు హామీలతో రెండో సారి, మూడోసారి అధికారంలోకి మోదీ వచ్చారు
ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ దుష్ట చతుష్టయం కుట్ర పన్నుతున్నారు
ఇప్పటి వరకు పాలకులుగా ఉండాలో రాజ్యాంగం నిర్ణయించింది.. దురదృష్టవశాత్తు ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారు
ఇప్పటికే దళితులు, గిరిజనులు, మహిళలు, మైనార్టీలకు చెందిన 13 కోట్ల ఓట్లు తొలగించారు, మరో 7 కోట్ల ఓట్ల తొలగింపుకు ప్రయత్నిస్తున్నారు
ఈ దేశం కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ గాంధీ ప్రాణత్యాగాలు చేశారు
దేశ రక్షణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ గాంధీ వాదంతో పోరాడుతుంటే, గాడ్సే వారసత్వంతో మోదీ ముఠా పనిచేస్తోంది
మనం గాంధీ కుటుంబం పక్షాన నిలవాలి
గాంధీ పక్షాన నిలిచి మోదీ కౌరవ సైన్యాన్ని ఓడించాలి
స్వాతంత్ర్యం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్, అధికారం కోసం పుట్టిన పార్టీ బీజేపీ
వందేళ్ల క్రితం కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఉంది, మరో వందేళ్లు ఉంటుంది
బీజేపీ నాడు లేదు రేపు ఉంటుందో లేదో తెలియదు
వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిపించాలి







