తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), ఆయన సతీమణి భువనేశ్వరి (Bhuvaneswari) దర్శించుకున్నారు. తొలుత ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ఎం.రవిచంద్ర (Ravichandra), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkaiah Chowdary), అర్చకులు సీఎం దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని చంద్రబాబు, భువనేశ్వరి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వారికి అర్చకులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.







