అమెరికాలో “స్టార్ మైండ్”.. మిలియన్ శాటిలైట్ ప్రయోగానికి స్పేస్ ఎక్స్ సన్నాహాలు..!
అంతరిక్షంలో ఆధిపత్యమే లక్ష్యంగా అమెరికా అడుగులేస్తోంది. తమ దేశానికి స్పేస్ఎక్స్ (SpaceX) ఏకంగా మిలియన్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ది యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ (ఎఫ్‌సీసీ) అనుమతులు మంజూరు చేసింది. ఈ ఉపగ్రహాలు అమెరికా అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు నిర్మాణానికి సహకరించనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి అనుమతి సాధించిన తొలి సంస్థగా స్పేస్ఎక్స్ నిలిచింది.
ఇవి కూడా చదవండి
సూర్యకాంతిని వాడుకొని ఉపగ్రహాలకు విద్యుత్తును అందజేసి.. వాటిలో డేటాను ప్రాసెస్ చేయాలన్నది ఎలాన్ మస్క్ ఆలోచన. ఈ శక్తిని ఏఐకు వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘స్టార్మైండ్’ అని పేరుపెట్టారు. దీనిపై ఎఫ్‌సీసీ స్పందిస్తూ స్టార్మైండ్ ప్రాజెక్టు అమెరికా సూపర్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ఎకానమీకి సహకరిస్తుందని పేర్కొంది. అమెరికా భూభాగంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ మస్క్ ప్రతిపాదనకు ఆమోదం లభించడం విశేషం. ఆర్బిటల్ డేటా సెంటర్లలో ఎనర్జీ ఖర్చు చాలా తక్కువ ఉంటుందని స్పేస్ ఎక్స్ చెబుతోంది.
మరోవైపు ఈ అనుమతులపై మస్క్.. ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘అభినందించదగిన విషయం. ఈ ప్రాజెక్టు భవిష్యత్తులో అమెరికా, ప్రపంచానికి ఓ గొప్ప ఆస్తిగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఉపగ్రహాల ప్రయోగం 2033 నవంబర్ నాటికి మొదలైపోవాలి. వీటిల్లో 2035 నాటికి 10% ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరతాయి. 2038 నాటికి ఈ ప్రాజెక్టు 50% పూర్తవుతుందని అంచనా. దీంతో వచ్చే ఏడాదే తొలి స్టార్మైండ్ శాటిలైట్‌ను ప్రయోగించే అవకాశం ఉంది.







