హైదరాబాద్ లో సచిన్ టెండూల్కర్ సందడి
దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ ఫార్ములా ఈ`రేసింగ్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఈ రేసింగ్ వీక్షించేందుకు సచిన్ నగరానికి వచ్చారు. క్యాలిఫయింగ్ రేసును ప్రత్యక్షంగా తిలకించారు. సచిన్‌తో పాటు శిఖర్ ధామన్, దీపక్ చాహర్, సినీనటుడు మహేశ్ బాబు సతీమణి నమ్రత, కుమారుడు గౌతమ్ కూడా రేసు చూసేందుకు తరలివచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నారా బ్రాహ్మణి కూడా హుస్సేన్ సాగర్ తీరానికి వచ్చారు. కార్ రేసింగ్‌ను వీక్షించేందుకు సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తరలిరావడంతో అభిమానుల్లో జోష్ కనిపించింది.













