కాంగ్రెస్ కు సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి గుడ్‌బై
సీట్ల పంచాయతీ కాంగ్రెస్‌లో చిచ్చురేపుతోంది. మహాకూటమిలో సీట్ల పంపకం ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజీనామా చేశారు. తనకు రాజేంద్రనగర్ టికెట్ కేటాయించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, డివిజన్ అధ్యక్షులు రాజీనామా చేస్తారని తెలిపారు. మహాకూటమి పేరుతో టీడీపీ నేత ఎల్.రమణ టిక్కెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. రాజేంద్రనరగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి అయితేనే గెలుస్తారని, రాజేంద్రనగర్‌లో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని కార్తీక్ చెబుతున్నారు. టీడీపీకి టికెట్ కేటాయించడతో కార్యకర్తలు ఆవేదన చెందారని, తన నిర్ణయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతిలో పెట్టామని కార్తీక్‌రెడ్డి తెలిపారు.













