టీఆర్ఎస్ లోకి సబితా ఇంద్రారెడ్డి?
తెలంగాణ మలి ఉద్యమానికి అంకురార్పణ చేసిన ఇంద్రారెడ్డి మరణం తర్వాత రాజకీయల్లోకి వచ్చి హోం మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారే అవకాశాలున్నాయనే సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్‌రెడ్డి పోటీ చేశారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేతితో ఓడిపోయారు. ప్రస్తుతం విశ్వేర్వర రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కార్తీకి రెడ్డి చేవెళ్ల నుంచి అదే పార్టీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం సన్నగిల్లింది. ఈ నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్లో చేరి కార్తీకరెడ్డిని చేవెళ్ల అభ్యర్థిగా పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.













