ఎమ్మెల్సీగా మధుసూదనాచారి ?
బలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, నాయీబ్రాహ్మణ, పద్మశాలి వర్గాలకు వచ్చే ఏడాది ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన మాజీ స్పీకర్ మధుసూధనాచారికి సీఎం అభయమిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఉత్సాహంగా కనిపించారు. ప్రధానంగా ఎంబిసి కులాలకు రాజకీయ అవకాశాలు కల్పించే యోచనలో సీఎం ఉన్నారు. భూపాలపల్లిలో ఓటమి అనంతరం మదుసూధనాచారి కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా లేక పోగా, ఇపుడు సీఎం సీనియర్ల సేవలు వినియోగించుకొవాలని నిర్ణయించడంతో పాతనేతలకు ఉత్సాహం లభించినట్లుయింది.













