గత ప్రభుత్వం మూలన పడేసిన… మేము పూర్తి చేస్తున్నాం

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతుపండుగ ముగింపు సభలో భట్టి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినవేనని చెప్పారు. జూరాల, కోయిల్‌సాగర్, భీమా వంటి ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని అన్నారు. గత ప్రభుత్వం మూలన పడేసిన ప్రాజెక్టులను క్రమంగా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజంగా ఇవాళ రైతు పండుగలా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే పండుగ వాతావరణం నెలకొందని భట్టి తెలిపారు.