ఎన్నారైల రైతుబంధు చెక్కులకు గ్రీన్ సిగ్నల్
రైతుబంధు పథకంలో లబ్ధిదారులుగా ఉండి, విదేశాల్లో నివసిస్తున్న పట్టాదారుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారై పట్టాదారులకు బదులుగా వారి కుటుంబ సభ్యులకు డిక్లరేషన్ తీసుకుని రైతుబంధు చెక్కులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో 61 వేల రైతు కుటుంబాలకు చెక్కులు అందనున్నాయి. ఎన్నికల సమయంలో ఈ చెక్కులను వెనక్కి తీసుకోవడం కంటే ఎన్నారైల కుటుంబ సభ్యులకు ఇవ్వడమే బాగుంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉన్న వారందరికీ చెక్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్ఆర్ఐలు డిక్లరేషన్ పంపిస్తే, ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేస్తారు.













