మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా.. రన్ ఫర్ ఫీస్
జాతిపిత మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న గచ్చిబౌలిలోని బొటానికల్ గార్డెన్లో ఎస్‌కేవీబీఆర్ వాకర్స్ అసోసియేషన్ రన్ ఫర్ పీస్ సెకెండ్ ఎడిషన్ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి జెర్సీలు, మెడల్స్‌ను హైదరాబాద్‌లో రాష్ట్ర ఆటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ శాంతి, ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు రేసు ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి రన్ పాల్గొనేందుకు రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ రన్‌కు ఎన్ఆన్ఆర్ డ్రీమ్ స్కేప్ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది.













