గల్ఫ్ బాధితుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం

గల్ప్‌లో ఇటీవల చనిపోయిన తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన వలస కూలీల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వేములవాడ మండలం మర్రిపల్లికి చెందిన అరిగెల శశి కుమార్, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు గత డిసెంబర్ 17, 19 తేదీల్లో సౌదీ అరేబియాలో మరణించారు.