అది విజయోత్సవ సభ కాదు.. సంతాప సభ
టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది విజయోత్సవ సభ కాదని, అది సంతాప సభ అని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తన అయ్య జాగీర్లా అడుగడుగునా కటౌట్లు పెట్టి కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. జనాభాలో 3 శాతం కూడా లేని అగ్రవర్ణాలు నర్సాపూర్, మెదక్ నియోజకవవర్గాలను పాలించడం చూస్తే బహుజన బిడ్డలు ఎంత వెనుకబడి ఉన్నారో అర్థమవుతోందన్నారు. జిల్లా కేంద్రంలో కనీసం పీజీ కళాశాల, ప్రభుత్వ కళాశాలలకు సొంత భవనాలు లేని దుస్థితిలో మెదక్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి రాబోయే రోజుల్లో బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలన్నారు.













