మిస్ హైదరాబాద్ గా రిషిత కొరుటూరు
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ట్రెండ్స్ మిస్ హైదరాబాద్ 2017 కిరీటాన్ని మిస్ రిషిత కొరుటూర్ కైవసం చేసుకుంది. మొదటి రన్నరఫ్‌గా మిస్ అరుణిమ సురేష్, రెండవ రన్నరఫ్‌గా మిస్ యామిలీ ప్రసాద్‌లు దక్కించుకున్నారు. భారతీయ సంప్రదాయ దస్తులను ధరించి ర్యాంప్‌పై ప్రదర్శించి అలరించారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ప్రదర్శనలో మోడల్స్‌కు సబ్ టైటిల్స్, ప్రదర్శన నైపుణ్యాలను, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సమయ పాలనను ఆదారంగా చేసుకొని విజేతలను నిర్ణయించారు.
న్యాయనిర్ణేతలుగా ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐటీ ఇండస్ట్రీస్ జయేష్ రంజన్, ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ మదుర్ భండార్కర్, ష్యాషన్ డిజైనర్ శ్రబూవణ్కుమార్ రామస్వామి, ఎఫ్‌బీబీ ఫెమిన మిస్ గ్రాండ్ ఇండియా 2017 అనుకృతి గుసైన్, ఎఫ్‌బీబీ ఫెమిన మిస్ ఇండియా రెండో రన్నరఫ్ ప్రియాంక కుమారి, బాలీవుడ్ నటి బ్రూన అబ్ధుల్లా, మెడికల్ డైరెక్టర్ మమత దీన్‌దయాళ్, బాలీవుడ్ నటుడు షహవర్ అలీలు వ్యవహరించారు. మోడల్స ర్యాంప్వాక్లతో ఆకట్టుకున్నారు.













