తెలుగు మహా సభల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష
అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యేడాది డిసెంబర్ 15 నుంచి 19 వరకు హైదరాబాద్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరక కీలక అంశాలపై కోర్ కమిటీ పలు నిర్ణయాలపై చర్చించింది. ప్రపంచ తెలుగు మహాసభలకు ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన తెలుగు ప్రముఖులను ఆహ్వానించే అంశంపై జర్చ జరిగింది. ఇతర దేశాధినేతలు ఆహ్వానించడంతోపాటు పలువురు ప్రముఖులను పిలవడం, ముఖాముకి చర్చలు, వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియలపై సమావేశలో కీలక చర్చ జరిపారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డా|కె.వి.రమణాచారి, ఎంపీ కల్వకుంట్ల కవిత, తెలగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా |నందిని సిధారెడ్డి, పర్యాటక సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎస్వీ, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు అధ్యక్షులు డా.అయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.













