3 నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ పూర్తి చేయాలి : మంత్రి పొంగులేటి

తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్)పై కలెక్టర్లతో సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ ఉంటుందని, 3 నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25.70 లక్షల పెండిరగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం నాలుగేళ్లుగా లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనకు మల్టీ డిసిప్లినరీ బృందాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడిరచారు. సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాలను కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాలని సూచించారు.