రేవంత్‌పై వేటుకు రంగం సిద్ధం?
తెలంగాణ తెలుగుదేశం పార్టీ(టీ టీడిపి)లో రేవంత్‌రెడ్డి వివాదం రోజురోజుకు ముదురుతోంది. రేవంత్ రెడ్డిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ను పార్టీ పదవుల నుంచి తొలగించాలని తెలంగాణ అధ్యక్షుడు రమణ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. వర్కింగ్ ప్రెసిడెంట్, టిడిఎల్పి నేతగా రేవంత్‌ను తప్పించాలని ఈ లేఖలో రమణ కోరినట్లు తెలిసింది. అయితే ఈ నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాల దృష్టా గురువారం టిడిఎల్పి సమావేశం ఉంటుందని ప్రకటించారు. విషయం తెలుసుకున్న రమణ రేపు ఎలాంటి సమావేశం ఉండదని సృష్టం చేశారు. రేవంత్‌కు సమావేశం నిర్వహించే అర్హత లేదని ఈ సందర్భంగా రమణ అన్నారు. కాగా, గురువారం సాయంత్రం హోటల్ గోల్కోండలో టీ టీడీపీ, బిజెపి ముఖ్యనేతల సమావేశం జరగనుంది.













