ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐతో పొత్తు ఖాయమైనట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు హైదరాబాద్లోని సీపీఐ కార్యాలయానికి వెళ్లిన ఆయన ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. ఆ స్థానంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీ స్థానాలను సీపీఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. పెద్దమనసుతో సహకరించాలని సీపీఐని కోరినట్లు తెలిపారు. కాంగ్రెస్`సీపీఐ సమన్వయం కోసం కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.













