డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు : రేవంత్
దేశ యువత మహాత్మా గాంధీని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలంంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఫాసిస్టులకు వ్యతిరేకంగా గాంధీ చూపిన దారిలో యువత పోరాటా చేయాలన్నారు. మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టబెడుతున్నారు. దేశ భవిష్యత్‌ను వారి చేతుల్లో పెడుతున్నారని అన్నారు. డిఫెన్స్‌లో ప్రైవేట్‌కు అనుమతిస్తే దేశ భద్రతకే ముప్పు అన్నారు. తెలంగాణలో అమరుల కుటుంబాలు అనాధలైనవి. గులాబీ చీడ నుంచి విముక్తి కల్పించడానికి కాంగ్రెస్ కార్యక్రమం తీసుకుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల ఆశయాల కోసం జంగ్ సైరన్ మోగిస్తుందన్నారు. ర్యాలీ కోసం వస్తున్న కాంగ్రెస్ నేతలను, విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీని రసాభాసగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి లేదంటే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.













