ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ అందజేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు.













