రేవంత్ రెడ్డి రాజీనామా
మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణ వైఫల్యానికి బాధ్యత తీసుకుంటూ ఏఐసీసీ అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్టు రాహుల్ గాంధీ ప్రకటించడం కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పగ్గాలు మీ చేతుల్లోనే ఉండాలంటూ సీనియర్ నేతలు సహా ఎవరు చెప్పిన రాహుల్ వినిపించుకోవడం లేదు. దాంతో, ఆయనంతటివాడే తప్పుకుంటున్నప్పుడు తమకెందుకు పదవులు అంటూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికీ రాజీనామా చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ సృష్టం చేశారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరించేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు.













