అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ పాదయాత్ర చేస్తా : రేవంత్ సంచలన ప్రకటన

ప్రస్తుత పరిస్థితుల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించడం ఏమాత్రం సమంజసం కాదని తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అదో వికృతమైన చర్య అని పేర్కొన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకూ తాను పాదయాత్ర నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ రాజకీయాల్లో పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కానించారు. టీపీసీసీ చీఫ్ హోదాలో వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదని, కేవలం సమష్టి నిర్ణయాలు మాత్రమే ఉంటాయని ప్రకటించారు. అయితే పాదయాత్ర ఎప్పుడన్నది మాత్రం పార్టీ నిర్ణయించిన తర్వాతే తేదీని వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంస్థాగతంగా చాలా బలంగా ఉందని, తెలంగాణలో బీజేపీకి అంత పట్టు లేదని రేవంత్ విమర్శించారు.