తెలంగాణ నుంచి పోటీ చేయండి
వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానించిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందువల్ల రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఇందుకు ఆమె సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రేవంత్ సోనియాతో ఆమె నివాసంలో సమావేశమయ్యారు.













