ఎంపీ డి.శ్రీనివాస్‌ను కలిసిన రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మర్యాద పూర్వకంగానే డీఎస్‌ను కలిసానన్నారు. ఆయన కిందపడిపోగా చెయ్యి విరిగిందని, ఈ విషయం తెలిసి పరామర్శించేందుకు వచ్చానన్నారు. ఆపద వచ్చినప్పుడు తెలంగాణలో రాజకీయాలు ఉండవని అన్నారు. శ్రీనివాస్ తనకు చాలా దగ్గర మనిషని అందుకే పలకరించేందుకు వచ్చినట్లు తెలిపారు. డి.శ్రీనివాస్ మాట్లాడుతూ తాను కిందపడిపోగా చెయ్యి విరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన రేవంత్ తనను పలకరించటానికి వచ్చారన్నారు. ఇందులో రాజకీయాలు లేవన్నారు. వయస్సులో చిన్నవాడనా తాను కింద పడ్డానని తెలిసి వచ్చారన్నారు. పీసీసీ అధ్యక్షుగా ఉన్న రేవంత్ రెడ్డి పలకరించడానికి ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని డీఎస్ తెలిపారు.













