కాంగ్రెస్ లోకి తుమ్మల..?
బీఆర్ఎస్ అసంతృప్త నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆ పార్టీ నేతలు తుమ్మలను ఆహ్వానించారు. తుమ్మలతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవిలు భేటీ అయ్యారు. ఈసందర్భంగా తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో.. కుదరకుంటే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు పెడుతున్న తుమ్మల.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.













