సచివాలయ నిర్మాణాన్ని అడ్డుకుంటాం
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సచివాలయాన్ని ఆధునిక పరిజ్ఞానంతోనే నిర్మించారని, మూఢ నమ్మకాల పిచ్చితో దాన్ని కూల్చివేయాలనుకోవడం సరికాదని టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తూర్పారబట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తన మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూలగొడతామని అంటున్నారని విమర్శించారు. సచివాలయ భవనాల కూల్చివేతను అడ్డుకుంటామని సృష్టం చేశారు. కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అమరవీరుల స్మారకాన్ని పునాదిరాయి పడలేదు కానీ, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారని విమర్శించారు.













