కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అది సాధ్యం
సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తుందని విమర్శించారు. బలవంతంగా భూములు లాక్కోవద్దని ప్రశ్నించిన వారికి సంకెళ్లు వేసి నిర్బందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ను రద్దు చేయడమే మార్గమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ధరణి లోపాల కారణంగా హత్యలు పెరుగుతున్నాయని తెలిపారు. ఐకియా కంపెనీకి 19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఇప్పటికే కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు దోచుకుంది. ధరణి పోర్టల్‌కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మేం ప్రశ్నిస్తున్నందుకే ధరణిపై కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ధరణి పోర్టల్ భూ సమస్యకు సంబంధించి లక్షకు పైగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి అని పేర్కొన్నారు.













