కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం .. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మోడల్ దేశానికే ప్రమాదం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కర్నాటకలో కాంగ్రెస్ను అస్థిరపరచాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కర్నాటక ఎన్నికల్లో కుమారస్వామికి కేసీఆర్ వందల కోట్లు ఇస్తున్నారు. అక్రమ సొమ్ముతో దేశరాజకీయాలను శాసించాలని చూస్తున్నాను. జేడీఎస్ ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేలకోట్లు సమకూర్చుతా అని బేరసారాలు మొదలుపెట్టారు. భూములను వనరులగా పెట్టుకుని డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు. తనతో ఉన్న వాళ్లుకు భూములు పంచుతున్నారని ఆరోపించారు.
హైటెక్ సిటి వద్ద తన అనుచరుడికి 60 ఏళ్లు పాటు లీజుకు 15 ఎకరాలను రాసినట్టు తెలిపారు. భూమి విషయంలో అధికారుల ఆదేశాలు కాదని కేసీఆర్ భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. ఇంత అన్యాయం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ వందలాది కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎన్నికలకు ముందు, తర్వాత కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత? అని అడిగారు. ఈ విషయంలో దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాస్తాను. కేసీఆర్ అవినీతిని వివరిస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీబీఐకి కూడా లేఖ రాస్తానని తెలిపారు.













