కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే… ప్రగతిభవన్ ను
ప్రజాప్రతినిధులు, ఉద్యమ నాయకులు, ప్రజలను అనుమతించని ప్రగతిభవన్ గేట్లను కచ్చితంగా బద్దలు కొడతామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్‌ను నాలెడ్జ్ సెంటర్‌గా మార్చి అంబేడ్కర్ పేరు పెడతామని వెల్లడించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వ భూములను కేటీఆర్ బృందం కొల్లగొట్టిందన్నారు. ఈ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు కేటీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ భజన మండలిగా అసెంబ్లీ మారిందని విమర్శించారు.













