ఈసారి మెదక్ మనదే.. రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరపురాని వ్యక్తి ఇందిరాగాంధీ. అటువంటి ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ స్థానం తమకు ఎంతో ప్రత్యేకమని.. ఈసారి కచ్చితంగా ఈ ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని గెలిచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాదులో జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికలలో మెదక్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని పేర్కొన్నారు. కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.