ప్రగతిభవన్‌లో గణతంత్ర వేడుకలు
74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు సీఎం కేసీఆర్ పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, నవీన్‌రావు, శంభీపూర్ రాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













