నిజామాబాద్ ఐటీ హబ్ ని పర్యటించిన అమెరికా, ఆస్ట్రేలియా కంపెనీల ప్రతినిదులు
ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఐటి టవర్ల ప్రారంబం తరువాత త్వరలో నిజామాబాద్ పట్టణములో ప్రారంబించనున్నారు. బీఆరెస్ గ్లోబల్ కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల అద్వ్యర్యములో అమెరికా, ఆస్టేలియా ఐటీ కంపెనీల ప్రతినిదులు ఐటి హబ్ ని పరిశిలించారు. నిజామాబాద్ ఐటి హబ్ లో అన్ని వసతులు కల్పించారని అన్నారు ఇంకుబేషన్ సెంటర్ కూడా ఉందని అన్నారు. నిజామాబాద్ పట్టణానికి ఐటీ పరిశ్రమ అభివృద్ధి కొరకు కావల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయని ప్రతినిధులు తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యా సంస్థల ద్వారా ఐటి పరిశ్రమలకు కావాల్సిన నాణ్యమైన మానవ వనరుల లభ్యత సాధ్యం అవుతుందన్నారు.
వందలాది మంది తెలుగు ఎన్నారైలు విదేశాల్లో అనేక ఐటి కంపెనీలు పెట్టారని, వీరీలో కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి ప్రభుత్వం తరపున, పాలసీ పరమైన రాయితీలు కల్పించనున్నట్లు తెలిపారు, అలాగే ప్రతి నిధుల బృందం అర్బన్ ఎమ్మెల్లే గణేష్ బిగాల గారితో భేటీ అయ్యారు, గణేష్ బిగాల ఐటీ హబ్ గురించి అలాగే వస్తులు గురించి అన్ని రకాలుగా ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రతినిధుల బృందం ఐటీ హబ్ ని పరిశీలించిన తరువాత చాల సంతోషం వ్యక్తం చేసారు అలాగే అన్ని రకాలుగా సౌకర్యాలు ఉన్నాయని రాబోయే రోజుల్లో ఎన్నో ఐటీ కంపెనీలను ఇక్కడికి థిస్ విదంగా కృషి చేస్తామ అని చెప్పారు.
అలాగే ఐటీ హబ్ ప్రచార నిమ్మితం ఇట్ సర్వ్ 16-03-2023 ఆద్వర్యములో Webinar నిర్వహించనున్నారని తెలిపారు. ఈ Webinar కి ఎమ్మెల్సి కవిత, MLA గణేష్ బిగాల, విజయ్ రంగినేని CEO ఐటి తెలంగాణ, మహేష్ బిగాల పాల్గోనున్నట్టు తెలిపారు.













