రాజ్యసభ సభ్యురాలిగా రేణుక ప్రమాణ స్వీకారం

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన (షిండే వర్గం) పార్టీకి చెందిన మిలింద్ దేవ్‌రాతో పాటు సీనియర్ జర్నలిస్టు, రచయిత సాగరికా ఘోష్ కూడా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హాల్‌లోని ప్రత్యేక రూంలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వీరితో పాటు మరో ఏడుగురు కూడా ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. రేణుకా చౌదరి 1984లో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. టీడీపీ తరపున రెండు సార్లు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. దేవగౌడ్, మన్మోహన్ ప్రభుత్వాల హయాంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయాక 2012లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభ ఎంపీగా రేణుకా చౌదరి ఎన్నికయ్యారు.