మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్

ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ జూబ్లీహిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీత యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణుదేశాయ్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా రేణుదేశాయ్‌ను కొండా సురేఖ సత్కరించారు.