బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కొడలైనా సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నుంచి తీసేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. సానియా మీర్జా బదులు తెలంగాణ బిడ్డలైన పీవీ సిందు, సైనా నెహ్వాల్ లాంటి మంచి క్రీడాకారులను బ్రాండ్ అంబాసిడర్గా నియమించాలని రాజాసింగ్ కోరారు. భారత టెన్నిస్ స్టార్ సానిమా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్మాలిక్ను పెళ్లి చేసుకున్నందుకు ఆమెకు ఇబ్బందులు తప్పడం లేదు. భారత్-పాక్ మధ్య ఏ వివాదం చెలరేగినా భారత నెటిజన్లు సానియాను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు.













