సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు.. ఊరట
సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట లభించింది. దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ పర్వేశ్వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలపై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆమె హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజంక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని పర్వేశ్వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలకు కోర్టు ఆదేశించింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దని పేర్కొంటూ పర్వేశ్వర్మ, మజుందర్కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.













