మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రైలు రోకో కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ విచారణపై కోర్టు స్టే విధించింది. విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేసి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 2011లో రైలు రోకోకు కేసీఆర్ పిలుపునివ్వడంతో కేసు నమోదైంది. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసు కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.