24న యూఎస్ స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ సెషన్

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ అధికారులు యూఎస్ స్టూడెంట్ వీసీ ఇన్ఫర్మేషన్ సెషన్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది. 2024, 2025కు సంబంధించిన స్టూడెంట్ వీసాల దరఖాస్తులో సందేహాలను వీసా అధికారి నివృత్తి చేయనున్నారు. ఇందులో పాల్గొనాలకునేవారు https://us06web.zoom.us/meeting/register/tZAldO-uqDstE9YUBkcxhV3TgTVltv1uFMjM#/registration లో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగతంగా పాల్గొనాలనుకునే వారు జూబ్లీహిల్స్‌లోని ఎస్‌ఎల్ జూబ్లీ కాంప్లెక్స్‌లో జరిగే సదస్సుకు హాజరుకావాలని కోరారు.