తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లాక్‍డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్‍డౌన్ అమల్లో ఉండనుంది. ఈ నేపథ్యంలో పది రోజుల పాటు వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22 వరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటల నుండి అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు.