మే 3 వరకు ఇలాగే పనిచేయాలి
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కోవిడ్ -19 గైడ్లన్స్ మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న తరహాలోనే మూడోతేదీ వరకు హైకోర్టు, అనుబంధ కోర్టులు పనిచేయాలని మంగళవారం రిజిస్ట్రార్ నోటిఫికేషన్ జారీ చేశారు. మరణశిక్ష, నేరపూరితమైన కేసులు, బెయిల్ అప్లికేషన్లు, యాంటిస్పెటరీ బెయిళ్లు, పెండింగ్‌లోని బెయిల్ వ్యాజ్యాలు, ఫ్యామిలీ లాకు సంబంధించిన కేసులు, సర్వీస్ పెన్షన్ల నిలుపుదల తదితర కీలక కేసులను విచారించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ కేసులు, ఈ ఫైలింగ్‌ను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు మాత్రమే అనుమతించాలన్నారు. హైకోర్టు అనుబంధ కోర్టుల్లో అత్యవసర కేసులను ప్రిన్సిపల్ జిల్లా జడ్జిల సూచనలు, సలహాల మేరకే స్వీకరించాలని పేర్కొన్నారు.













