మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు. సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మన్చే బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ చీఫ్ అమిత్ షా పార్టీ బలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగా బలమైన నేతను రంగంలోకి దింపాలని భావించి.. గవర్నర్గా ఉన్న విద్యా సాగర్ రావు పదవీకాలన్ని పొడిగించలేదనే ప్రచారం జరిగింది. పార్టీకి చెందిన సీనియర్ లీడర్స్ సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మ్రోగించింది. అయితే టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కమలం జెండా ఎగురుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.













