కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం… త్వరలో ఆ వ్యవస్థ రద్దు!
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఆర్డీవో (రెవెన్యూ డివిజన్ ఆఫీసర్స్) వ్యవస్థను రద్దు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తర్వాత వీరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో త్వరలో ఆర్డీవో వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన రెవెన్యూ డివిజన్ అధికారి పోస్ట్ కాలగర్భంలో కలిసిపోనుంది. ఇప్పటికే వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రెవెన్యూ డివిజన్ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 74 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇటీవల కొంత మందికి ప్రమోజన్ల కూడా ఇచ్చారు. దాదాపు 90 మంది వరకు ఆర్డీవోలు పనిచేస్తున్నారు. వీరందరికి కొత్త పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది.













