రావినూతల సత్యనారాయణ గారి రచనల ఆవిష్కరణ
ఆచార్య రావినూతల సత్యనారాయణ గారి రచనలు, సారస్వత వ్యాసాలు, వ్యాస మంజూష లను ఈరోజు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీ ఎల్.వి.సుబ్రమణ్యం ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన ఆచార్య కొలకలూరి ఇనాక్ సత్యనారాయణ గారి రచనలు మనలను పరవశింపచేస్తాయని ప్రశంసించారు. వారి వ్యాసాలన్నీ పరిశోధనాత్మకంగా ఉంటాయని పేర్కొన్నారు.
దూరదర్శన్ పూర్వ ప్రయోక్త శ్రీ ఓలేటి పార్వతీశం సత్యనారాయణ గారి వ్యాసాలు కీలకాంశాలను శాస్త్రీయంగా నిరూపించటంలో ముందుంటాయన్నారు.
తెలుగు టైమ్స్ ఎడిటర్, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సి.వి.సుబ్బారావు మాట్లాడుతూ కుటుంబానికి పెద్దగా ఉంటూనే
సాహిత్య వ్యాసంగం కోసం హైదరాబాద్ తరలి వచ్చారన్నారు.
రావినూతల వరలక్ష్మి మాట్లాడుతూ ఆచార్య సత్యనారాయణ గారికి తెలుగు సాహిత్యమంటే చిన్నతనం నుంచి అభిమానమన్నారు.
సి.యస్.రాంబాబు మాట్లాడుతూ సత్యనారాయణ గారి వ్యాసాలన్నీ రచయిత నేపథ్యాన్ని, ఆతని సమగ్ర సాహిత్యాన్ని విశ్లేషిస్తూ సమకాలీన రచయితల అభాప్రాయాలు పొందుపరచటం ఆయన ప్రత్యేకత అన్నారు.
సియస్ ఆర్కే ప్రసాద్ మాట్లడుతూ వృత్తి వారి ప్రవృత్తిని చాలా ప్రభావితం చేసిందని అందుకే గొప్ప సాహిత్యకారులయ్యారని అన్నారు.













