బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ కీలక నిర్ణయం
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని పేర్కొంటూ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ కృష్ణదాస్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె.క్ష్మణ్‌కు లేఖలు పంపించారు. ఈ కేసులో కోర్టు నుంచి రిలీఫ్ వచ్చేంత వరకూ తన నిర్ణయాన్ని సమ్మతించాలని ఆయన విన్నవించారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను నిర్ణయం తీసుకున్నానని, తన నిర్ణయం వెనుక ఎలాంటి ఒత్తిళ్ళు లేవని సృష్టం చేశారు. కేసుల విషయంలో వెళ్లిన తనపై న్యాయవాది రఘునందన్ రావు అత్యాచారం జరిపారంటూ ఇటీవల పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై రఘునందన్‌రావు స్పందిస్తూ తానెలాంటి తప్పు చెయలేదని సృష్టత కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.













