సమతామూర్తి సన్నిధిలో మాజీ రాష్ట్రపతి

మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ముచ్చింతల్ లోని సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతల్ చేరుకున్న ఆయనకు వేద పండితులు, ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. దివ్యసాకేతంలోని ఆలయాలను దర్శించుకున్నారు. వేద పాఠశాల విద్యార్థులు, పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.