ఈ సారి అలా చేస్తే.. వారిని వదిలే ప్రసక్తే లేదు : రాజాసింగ్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని సొంత పార్టీ నేతలకు రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ తనకు చెప్పారన్నారు. ఈసారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు. ఇక్కడి నుంచి అక్కడకు సమాచారం ఇస్తే అక్కడ వారు ఇక్కడికి సమాచారం ఇస్తారు మరిచిపోకండి అంటూ హెచ్చరించారు. ఈ ఎన్నిక తనకు జీవన్మరణ సమస్య అని తెలిపారు. చావడానికి భయపడను చంపడానికి భయపడను అని సొంత పార్టీనేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సొంత వాళ్లే తన వ్యూహాలను ప్రత్యర్థులకు అప్పగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. 2018లో తనను ఓడిరచేందుకు ప్రయత్నించిన వారి జాబితా తన వద్ద ఉందని పేర్కొన్నారు. తన ప్రత్యర్థులతో ఎవరు టచ్లో ఉంటారో తనకు బాగా తెలుసని పేర్కొన్నాడు. తనకు ఎవరైనా నమ్మకద్రోహం చేయాలనుకుంటే ఆలోచించుకోండి అంటూ సీరియస్ అయ్యారు.













